Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో కిడ్నాప్ కలకలం... పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు

జగిత్యాల : ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

First Published Dec 29, 2022, 4:06 PM IST | Last Updated Dec 29, 2022, 4:06 PM IST

జగిత్యాల : ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల మండలం ధరూర్ గ్రామానికి చెందిన పన్నెండేళ్ళ సాయి లహరి 7వ తరగతి చదువుతోంది. అయితే ఇంటిబయట ఆడుకుంటుండగా గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేసారు. కానీ బాలిక కిడ్నాపర్లు మాట్లాడుకుంటుండగా చాలా చాకచక్యంగా కారులోంచి దూకేసింది. ఇలా కిడ్నాపర్ల చెరనుండి తప్పించుకున్న బాలిక తండ్రికి ఫోన్ చేసి ఆచూకీ తెలిపింది. వెంటనే అక్కడికి చేరుకున్న తండ్రి కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. సాయి లహరి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను ఎవరు కిడ్నాప్ చేసారు? ఎందుకు ఎత్తుకెళ్లారు? అన్నదానిపైన పోలీసులు విచారిస్తున్నారు.