విద్యుత్ దీపాల కాంతుల్లో దగదగా వెలిగిపోతున్న తెలంగాణ సచివాలయం...
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ కు డా. బిఆర్ అంబేద్కర్ పేరను ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. దీంతో సీఎం సూచన మేరకు గడువు లోపు పనులన్ని పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ నిర్మాణ సంస్థకు, అధికారులను పరుగెత్తిస్తున్నారు. తాజాగా గత రాత్రి సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మికంగా పరిశీలన చేపట్టారు. ఈ సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్యలో నిర్మాణంలోని సెక్రటేరియట్ దగదగా మెరిసిపోతూ కనిపించింది.