ఆస్కార్ సాంగ్ నాటు నాటు సింగర్ రాహుల్ కు తలసాని ఆత్మీయ సత్కారం
హైదరాబాద్ :ప్రపంచ సినీరంగంలో అత్యంత ఉన్నతమైనది ఆస్కార్ అవార్డ్.
హైదరాబాద్ :ప్రపంచ సినీరంగంలో అత్యంత ఉన్నతమైనది ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డును పొందేందుకు హాలీవుడ్ తో పాటు ప్రపంచంలోని మూవీ దిగ్గజాలు కోరుకుంటున్నాయి. అలాంటి అద్భుత అవార్డు తాజాగా తెలుగు సినిమా పాటకు దక్కిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కగా... తాజాగా ఈ పాట పాడిన యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఆస్కార్ వేడుకల తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలోనే వుండి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్ ను మంత్రి తలసాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నానని తలసాని అన్నారు.