మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని దంపతులు

హైదరాబాద్: ఆషాడమాసంలో హైదరాబాద్ ప్రజలు బోనాల పండగ అంగరంగవైభవంగా జరుపుకుంటారు.

Share this Video

హైదరాబాద్: ఆషాడమాసంలో హైదరాబాద్ ప్రజలు బోనాల పండగ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఇవాళ(ఆదివారం) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం తొలి బంగారు బోనం సమర్పించారు. బోనాలతో ఊరేగింపుగా ఉజ్జయిని ఆలయానికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి బియ్యం సమర్పించారు.

మహంకాళి ఆలయం వద్దకు చేరుకున్న శ్రీనివాస్ యాదవ్ దంపతులకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి తలసాని దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

Related Video