గాయాలతో పడివున్న వారిని చూసి చలించి... మానవత్వాన్ని చాటుకున్న మహిళా మంత్రి
మహబూబాబాద్: రోడ్డుప్రమాదానికి గురయి గాయాలతో రోడ్డుపై పడివున్న వ్యక్తులకు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
మహబూబాబాద్: రోడ్డుప్రమాదానికి గురయి గాయాలతో రోడ్డుపై పడివున్న వ్యక్తులకు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి మీదుగా మంత్రి వెళుతున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నారు. దీంతో ఇద్దరు వాహనదారులు గాయాలపాలై రోడ్డుపై పడివుండగా మంత్రి గమనించారు. దీంతో వెంటనే మంత్రి తన కాన్వాయ్ ని నిలిపి వారివద్దకు వెళ్లారు. గాయాలను చూసి చలించిపోయిన ఆమె స్వయంగా తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇలా తన బీజి షెడ్యూల్ లో కూడా సాటి మనుషులకు సాయం చేసిన మంత్రి స్థానిక ప్రజల ప్రశంసలు పొందారు.