బ్రెయిలీ లిపిలో కేసిఆర్ జీవిత చరిత్ర... పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్ :  దివ్యాంగులకు అందిచే ఆసరా ఫెన్షన్ డబ్బులను భారీగా పెంచి వారు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

First Published Feb 17, 2023, 12:25 PM IST | Last Updated Feb 17, 2023, 12:25 PM IST

హైదరాబాద్ :  దివ్యాంగులకు అందిచే ఆసరా ఫెన్షన్ డబ్బులను భారీగా పెంచి వారు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో అతడిపై దివ్యాంగులు ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల తరపున ఏదయినా గుర్తిండిపోయే కానుక ఇవ్వాలని భావించారు రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి. దీంతో తమను కంటికిరెప్పలా చూసుకుంటున్న కేసీఆర్ జీవిత చరిత్రనే అందులను అందుబాటులోకి తేవాలనే ఆలోచన తట్టింది. ఇందులోంచి పుట్టిందే బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకం. వాసుదేవరెడ్డి బృందం ఎన్నోరోజులు కష్టపడి బ్రెయిలీ లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను ముద్రించారు. ఈ పుస్తకాన్ని కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి బృందాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు బాలమల్లు, సతీష్ రెడ్డి,  కాన్సెప్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు తదితరులు పాల్గొన్నారు.