మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: మంత్రి జగదీష్ రెడ్డి
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు.
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ స్పందించినట్లు ఆయన తెలిపారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకున్నారని చెప్పారు.
ప్రమాదం వార్త తెలిసిన వెంటనే జగదీష్ రెడ్డి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. జాన్ పాడ్ దర్గా పర్యటనను రద్దు చేసుకుని ఈ ఉదయం దేవరకొండ చేరుకున్నారు. మూడు లక్షల రూపాయల ఆర్తి సహాయంతో పాటు అర్హులైనవారికి రెండు పడకల ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ప్రమాదంలో గాయపడినవారికి ప్రభుత్వపరంగా చికిత్స అందించనున్నట్లు మంత్రి తెలిపారు.