తెలంగాణ సివిల్స్ విజేతలకు మంత్రి హరీష్ అల్పాహారవిందు
హైదరాబాద్: సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆలిండియా సర్వీసులకు ఎంపికయిన తెలంగాణ యువతీయువకులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్: సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆలిండియా సర్వీసులకు ఎంపికయిన తెలంగాణ యువతీయువకులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ (బుధవారం) ఉదయం హైదరాబాద్ లోని తన నివాసానికి సివిల్స్ ర్యాంకర్లను ఆహ్వానించిన మంత్రి వారికి అల్పాహారవిందు ఇచ్చారు. సివిల్స్ ర్యాంకర్లతో కలిసే మంత్రికూడా టిఫిన్ చేస్తూ సరదాగా ముచ్చటించారు.
హైదరాబాద్ లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో ర్యాంకర్లు హరీష్ రావును కలిశారు. ర్యాంకర్లను మంత్రి ఘనంగా సత్కరించారు. సివిల్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించడంద్వారా వీరు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత హైదరాబాద్ లో ఐఏఎస్ శిక్షణ సంస్థ ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని మంత్రి హరీష్ అభినందంచారు.