స్కూటీపై వచ్చి... అందరూ చూస్తుండగానే వరద కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేట పంపు హౌస్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేట పంపు హౌస్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి కాలువలో దూకడాన్ని గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వరద నీరు ఎక్కువగా ఉండడంతో కాపాడలేకపోయారు. ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు.