userpic
user icon

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ బురిడీ... లబోదిబోమంటున్న బాధితులు

Chaitanya Kiran  | Published: Apr 30, 2023, 10:19 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బురిడీ కొట్టించిన  ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.  కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ధర్మపురి అతని తనయుడు కలిసి 21 మంది  నుండి 52 లక్షలు వసూళ్లు చేసినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని ధర్మపురి ఇంటి ముందు బాధితులు ధర్నాకు దిగారు. కోర్టులో ఉద్యోగాలు కల్పిస్తామని... ఎలాంటి పరీక్షలు లేకుండా అపాయింట్మెంట్ చేసుకోవచ్చని మాయ మాటలు చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితుల నుండి మొదటి దఫా లక్ష రూపాయలు వసూలు చేసి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపిస్తూ 52 లక్షలు వసూలు చేశారన్నారు.

Read More

Video Top Stories

Must See