భారీ అగ్ని ప్రమాదాలు : కాలిపోయిన సెల్ టవర్.. 50 లక్షల నష్టం.. ఎలా జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండల కేంద్రం లో ఓ వ్యవసాయ పొలం లో కోయ కాళ్ళకు పెట్టిన నిప్పు ఓ సెల్ టవర్ కు తాకి భారీగా మంటలంటుకున్నాయి.
కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండల కేంద్రం లో ఓ వ్యవసాయ పొలం లో కోయ కాళ్ళకు పెట్టిన నిప్పు ఓ సెల్ టవర్ కు తాకి భారీగా మంటలంటుకున్నాయి. దీంతో స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయంతిచిన మంటలు అదుపులోకి రాకపోవడం తో ఫైర్ ఇంజన్ కు సమాచారం అందిచ్చారు. అప్పటికే ముప్పై లక్షల నష్టం జరిగినట్లు బాధితులు చెపుతున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే హుజూరాబాద్ లో రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగే ఓ టిప్పర్ కాంక్రీట్ మిక్షర్ తో పాటు పక్కనే ఉన్న ఓ టైర్ రీబటన్ షాప్ లో ఉన్న టైర్ లు దగ్దమయి ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో జమ్మికుంట హుజూరాబాద్ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో కి తెచ్చారు. దాదాపు 20 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.