Asianet News TeluguAsianet News Telugu

గాంధీ హాస్పిటల్ వద్ద భారీ జాతిపిత విగ్రహం... పరిశీలించిన మంత్రులు హరీష్, తలసాని

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ఎదుట జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ఎదుట జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణపనులతో పాటు హాస్పిటల్  అభివృద్ధి పనులు, బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు మంత్రులు పలు సూచనలు చేసారు. 

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... గాంధీ ఆసుపత్రి వద్ద 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమన్నారు. యావత్ ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలో గాంధీ హాస్పిటల్ అత్యద్భుత సేవలు అందించిందన్నారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గాని అవలంభించారని... కేసీఆర్ సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో  రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని హరీష్ అన్నారు. 
 

Video Top Stories