HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. అందుకే 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారన్నారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో సదరు భూములను చంద్రబాబు ప్రభుత్వం IMGకి ఇచ్చిందని.. వాటిని వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తీసుకున్నారని తెలిపారు.