కరీంనగర్ ని తాకిన కర్ణాటక ఎన్నికల వేడి... బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్దళ్ సంస్థను నిషేధిస్తామనే వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బిజెపి శ్రేణులు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. 

Share this Video

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్దళ్ సంస్థను నిషేధిస్తామనే వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బిజెపి శ్రేణులు పోటాపోటీగా ఆందోళనకు దిగారు . బిజెపి కార్యకర్తలు స్థానిక తెలంగాణ చౌక్ లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని డిజిఎం వ్యాన్ లో తరలించారు. ఇటు కాంగ్రెస్ కార్డు పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అటుగా వచ్చిన కొంతమంది బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఫల్యం వల్లే బిజెపి కార్యకర్తలు తమ కార్యాలయం వరకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Related Video