సర్పంచ్ తనయుల వీరంగం... కోరుట్ల పోలీస్ స్టేషన్ వద్ద బాధితల ఆందోళన

జగిత్యాల : గ్రామ ప్రజలకు సమస్యలు వస్తే తీర్చాల్సిన బాధ్యతాయుత పదవిలో వున్న సర్పంచే ఆ గ్రామస్తులకు సమస్యగా మారాడు.

First Published Oct 6, 2022, 4:23 PM IST | Last Updated Oct 6, 2022, 4:23 PM IST

జగిత్యాల : గ్రామ ప్రజలకు సమస్యలు వస్తే తీర్చాల్సిన బాధ్యతాయుత పదవిలో వున్న సర్పంచే ఆ గ్రామస్తులకు సమస్యగా మారాడు. సర్పంచ్ తనయులిద్దరూ గ్రామంలో వీరంగం సృష్టిస్తున్నారని... కారణం లేకుండానే గ్రామస్తులతో గొడవపడి దాడులకు దిగుతున్నారంటూ జగిత్యాల జల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇటీవల ఇద్దరు గ్రామస్తులపై దాడికి దిగిన సర్పంచ్ తనయులపై చర్యలు తీసుకోవాలంటూ కల్లూరు వాసులు పెద్దఎత్తును పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పి ఆందోళనకారులను పంపించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడిన బాధితులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గ్రామంలో అలజడి సృష్టిస్తున్న నిందితులను శిక్షించాలని కోరారు. అంతటితో ఆగకుండా జగిత్యాల కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడానికి కల్లూరు గ్రామస్తులు సిద్దమయ్యారు.