గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం పంప్ హౌస్ మోటార్లు నిలిపివేత
గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ లో మోటార్లు నిలిపివేశారు.
గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ లో మోటార్లు నిలిపివేశారు.పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతీ పంప్ హౌస్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటార్లు ఆఫ్ చేసినట్లు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.ఈ రోజు ఉదయం వరకు పార్వతీ బ్యారేజీ లోకి నీటిని ఎత్తిపోశారు. వరుసగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరినదిలో నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.