Asianet News TeluguAsianet News Telugu

ఐటీ అధికారులతో మంత్రి మల్లారెడ్డి వాగ్వాదం... ఇంటివద్ద హైడ్రామా

హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత చామకూర మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

First Published Nov 23, 2022, 2:45 PM IST | Last Updated Nov 23, 2022, 2:45 PM IST

హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత చామకూర మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంత్రితో పాటు ఆయన కొడుకు మహేందర్ రెడ్డి, మరికొందరు బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండోరోజు కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఒక్కసారిగా ఛాతీనొప్పితో బాధపడగా ఐటీ అధికారులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. దీంతో మంత్రి హుటాహుటిన తన కొడుకును చూసేందుకు హాస్పిటల్ వద్దకు వెళ్లగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. అంతకుముందు ఐటీ అధికారులతో మంత్రి మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తన కొడుకును ఐటీ అధికారులు వేధిస్తున్నారని... భౌతికదాడికి దిగారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఐటీ అధికారులు, సీఆర్పిఎఫ్ పోలీసులు కొట్టడం వల్లే కొడుకు హాస్పిటల్ పాలయ్యాడని మంత్రి ఆరోపించారు. ఇప్పటికీ తన కొడుకు భయంతో వణికిపోతున్నాడని అన్నారు. 200 మంది ఐటీ అధికారులతో తమపై దాడులు చేయించి భయపెడతారా? బీజేపీ రాజకీయ కక్ష్యతోనే  ఇలా ఐటీ రైడ్స్ చేయిస్తుందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.