Asianet News TeluguAsianet News Telugu

TYE గ్లోబల్ ఫైనల్స్‌లో సత్తా చాటిన హైదరాబాదీలు

TiE సీటెల్ నిర్వహించిన TYE గ్లోబల్ ఫైనల్స్‌లో హైదరాబాద్ స్టూడెంట్ స్టార్టప్ టీం ‘ఫైండ్ఆర్’ రన్నర్ అప్ గా నిలిచి 1500 డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. 

TiE సీటెల్ నిర్వహించిన TYE గ్లోబల్ ఫైనల్స్‌లో హైదరాబాద్ స్టూడెంట్ స్టార్టప్ టీం ‘ఫైండ్ఆర్’ రన్నర్ అప్ గా నిలిచి 1500 డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. TYE గ్లోబల్ 11వ వార్షిక సంచికలో ప్రపంచవ్యాప్తంగా 32 జట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆదివారం విర్చువల్ గ్రాండ్ ఫైనల్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించబడిన ప్రముఖ జ్యూరీ ప్యానెల్‌ ప్రతి జట్లు 10 నిమిషాలు కేటాయించింది. TiE హైదరాబాద్ ఛాప్టర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ ఫైండ్ఆర్ వారి వినూత్న ఆలోచనతో జనవరి 2020 లో జరిగిన రీజనల్ బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ లో  విన్నర్స్ గా ప్రకటించబడింది. బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం లింక్డ్ఇన్ లాంటి పరిష్కారం, పనిమనిషి, క్లీనర్, కస్టమర్లకు డ్రైవర్లు లాంటి సౌకర్యాలమీద వీరి ఆలోచనలు గెలుపుకు దారి తీశాయి. ఈ ఐదుగురు విద్యార్థుల బృందానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన ఎన్ హస్వంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ విజయాన్ని TIE మెంటర్స్, తల్లిదండ్రులు హైదరాబాద్ జట్టుకు అంకితం చేస్తున్నామన్నారు.