Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ బిఆర్ఎస్ లో ముసలం... మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్ల తిరుగుబాటు

కరీంనగర్ : జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్ల తిరుగుబాటు మరిచిపోకముందే హుజురాబాద్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది. 

కరీంనగర్ : జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్ల తిరుగుబాటు మరిచిపోకముందే హుజురాబాద్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికార బిఆర్ఎస్ కౌన్సిలర్లు సొంత పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్సన్ పై అసమ్మతి రాగం అందుకున్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధికకు వ్యతిరేకంగా 25 మంది కౌన్సిలర్లు కరీంనగర్ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ను వ్యతిరేకించడానికి గల కారణాలను వివరిస్తూ కౌన్సిలర్లంతా సంతకాలు చేసారు. కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన లేఖను అందించిన తర్వాత బిఆర్ఎస్ నాయకులు, పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా కౌన్సిలర్లంతా రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వారితో టచ్ లోకి వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలను బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు.