Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్రూం ఇంటిపై ఆశలు కోల్పోయి... ఇద్దరు బిడ్డలతో రోడ్డుపైనే దంపతుల జీవనం

సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం గూడులేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది. 

సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం గూడులేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది. అయితే ఆ ఇళ్లు అర్హులకు కాకుండా అధికార పార్టీ నాయకులకు డబ్బులు ముట్టజెప్పే వారికే దక్కుతున్నాయనే ఆరోపణలు వున్నాయి. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వడం లేదు అన్నట్లుగా పెద్దసారు కేసీఆర్ నిరుపేదల సొంతింటి కలను నిజం చేయాలనుకుని సంకల్పించినా స్థానిక నాయకులు అది జరగనివ్వడం లేదు. ఇలా డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కక, కిరాయి ఇంటి అద్దెబారం మోయలేక సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నిండు గర్భిణి భర్తా, ఇద్దరు బిడ్డలతో కలిసి ఆరు నెలలుగా రైతు బజార్ లో నివాసముంటోంది. స్వయంగా ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే నిరుపేదల పరిస్థితి ఇలా వుంది... ఇక మిగతా నియోజకవర్గాల్లో ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అర్హులకే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే ఈ పరిస్థితి వుండేది కాదుకదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Video Top Stories