హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం... వడగండ్ల వాన బీభత్సం
హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల, వడగండ్లతో పాటు చల్లటి గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల, వడగండ్లతో పాటు చల్లటి గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వేసవి ప్రారంభమై భానుడి భగభగలు మెల్లిగా పెరుగుతున్న సమయంలో ఈ వర్షాలు వాతావరణాన్ని చల్లబరిచాయి.బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి బీహార్ నుంచి ఛత్తీస్ గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా విస్తరించి ఉందని... దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి (భారత వాతావరణ శాఖ) ప్రకటించింది. మరో మూడురోజులు కూడా ఇలాగే వాతావరణం చల్లగానే వుంటూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం వుందని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.