Asianet News TeluguAsianet News Telugu

భారీ గ్రానైట్ రాయి లారీలోంచి జారిపడి... సుల్తానాబాద్ లో కుప్పకూలిన ఇల్లు

పెద్దపల్లి : లారీలో తరలిస్తున్న పెద్ద గ్రానైట్ రాయి ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

First Published Feb 7, 2023, 2:57 PM IST | Last Updated Feb 7, 2023, 2:57 PM IST

పెద్దపల్లి : లారీలో తరలిస్తున్న పెద్ద గ్రానైట్ రాయి ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ క్రాసింగ్ వద్ద గ్రానైట్ లారీలోంచి జారిపడి దొర్లుకుంటూ ఓ ఇంటికి ఢీకొట్టింది. దీంతో ఇంటి గోడ కూలినా ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా తృటితో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కనుకుల క్వారి నుండి కరీంనగర్ లారీలో పెద్ద గ్రానైట్ రాయిని తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే సుల్తానాబాద్ పట్టణం మీదుగా లారీ వెళుతుండగా శ్రీరాంపూర్ క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. లారీలోంచి గ్రానైట్ ఒక్కసారిగా రోడ్డుపై పడి దొర్లుకుంటూ పక్కనే వున్న దక్షిణామూర్తి ఇంటిని ఢీకొట్టింది. దీంతో పెద్దశబ్దం చేస్తూ గోడ కూలింది. ఈ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న దక్షిణామూర్తి కుటుంబసభ్యులు భయంతో బయటకు పరుగుతీసారు. అయితే గోడకూలినా శిథిలాలు ఎవరిపైనా పడకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.