Asianet News TeluguAsianet News Telugu

బీహార్ ఇంచార్జ్ వంశీ యాదవ్ నివాసానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..

విశాఖపట్నం : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు బిజెఎంవై జాతీయ కార్యవర్గ సభ్యుడు బీహార్ ఇంచార్జ్ వంశీ యాదవ్ నివాసానికి వచ్చారు.

విశాఖపట్నం : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు బిజెఎంవై జాతీయ కార్యవర్గ సభ్యుడు బీహార్ ఇంచార్జ్ వంశీ యాదవ్ నివాసానికి వచ్చారు. అక్కడ కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... గత 45 సంవత్సరాలుగా పదవులకు ఆశించకుండా పార్టీకి కట్టుబడి పని చేశానని తెలిపారు. 

ఈ ఆత్మీయ సమావేశానికి ఒక గవర్నర్ గా కాకుండా స్నేహితుడిగా వచ్చానని తెలిపారు. మహిళలని గౌరవించడం, విద్యను అభ్యసించడం నేటి యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విభజన తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడుగా ఉండడమే తనకు ఇష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ను పలు సంఘాలు సన్మానించాయి.