Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి గంగోత్రి గ్రీన్ ఇండియా ఛాలెంజ్...

హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వం హరితహారం, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్... పేరేదైతేనేం తెలంగాణలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణానికి కాపాడేందుకు మొక్కల పెంపకం జోరుగా సాగుతోంది. 

Sep 21, 2022, 5:12 PM IST

హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వం హరితహారం, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్... పేరేదైతేనేం తెలంగాణలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణానికి కాపాడేందుకు మొక్కల పెంపకం జోరుగా సాగుతోంది. తాజాగా చిన్నారి గంగోత్రి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గంగోతి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్కులో మొక్క నాటారు. ప్రతిఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కావ్య కోరారు.