పెద్దపల్లిలో అగ్నిప్రమాదం... టపాసుల గోదాంలో మంటలు ఎగిసిపడుతూ భారీ పేలుళ్లు

పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో భారీగా నిల్వవుంచిన ఓ టపాసుల గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Share this Video

పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో భారీగా నిల్వవుంచిన ఓ టపాసుల గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టపాసులకు మంటలు అంటుకోవడంతో భారీ శబ్దాలతో పేలుడు సంభవించిందిమంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ చుట్టుపక్కల ప్రాంతాలవారిని భయాందోళనకు గురిచేసాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బందికి కూడా మంటలను అదుపుచేయడం కష్టతరమయ్యింది. చివరకు పెద్దపల్లి, మంథని, రామగుండం నుండి ఫైరింజన్లను తెప్పించి చాలా కష్టపడి చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో కోటి రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ యజమాని ఇల్లందుల కృష్ణమూర్తి తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ సారంగపనీ, సీఐ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి, బసంత్ నగర్ ఎస్ఐ లు రాజేష్, శ్రీనివాస్ లు పరిశీలించారు.

Related Video