Asianet News TeluguAsianet News Telugu

మిషన్ భగీరథకు సగం నిధులను కేంద్రం భరించాలి: ఎర్రబెల్లి (వీడియో)

మిషన్ భగీరథ పథకానికి నిధులను మంజూరు చేయాలని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని కోరారు.కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ద్య శాఖ దిల్లీలో జల్ జీవన్ మిషన్ పథకంపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలోఆయన పాల్గొన్నారు.
 
మిషన్‌ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని చేపట్టిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణ రాష్ట్ర మిషన్‌ భగీరథ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని గతంలోనూ కోరామన్నారు. ఈ అంశంపై ఈ ఏడాది జూన్‌ 11న దిల్లీలోనే మంత్రికి స్వయంగా లేఖ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.మిషన్‌ భగీరథకు మద్దతిచ్చేలా  50 శాతం నిధులను కేంద్రం  భరించాలని కోరారు.