Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్... దమ్ముంటే నీ గజ్వెల్లోనో, నా హుజురాబాద్ లోనో తేల్చుకుందాం రా: ఈటల సవాల్

కరీంనగర్ : తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. 

కరీంనగర్ : తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ప్రగతి భవన్ కేంద్రంగానే హుజురాబాద్ లో అల్లర్లకు కుట్ర జరిగిందని... దీన్ని ప్రజలే తిప్పికొట్టాలని ప్రజలకు ఈటల సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి ఉద్యమకారులపై రాళ్లు వేయించిన వారికి, జిప్పు తీసి చూపించిన సైకోలకు పదవులిచ్చి కేసీఆర్ రెచ్చగోడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పదవిచ్చి చిల్లర పనులు చేయిస్తున్నాడంటూ కౌశిక్ రెడ్డి సవాల్ పై ఈటల విరుచుకుపడ్డారు. ఇలా చిల్లరగాల్లతో రండలా దొడ్డిదారిలో యుద్దమెందుకు... నీ గజ్వేల్లోనో లేక నా హుజురాబాద్ లోనో తేల్చుకుందాం రా... అంటూ కేసీఆర్ కు ఈటల మరోసారి సవాల్ విసిరారు. చిల్లరగాళ్ల మాటలు నమ్మి బలికావద్దని ఈటల సూచించారు.