Asianet News TeluguAsianet News Telugu

ఫుల్లుగా తాగిన మహిళ.. భర్తను చంపుతా అంటూ బెదిరింపులు.. ఎందుకంటే..

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద పట్టపగలే తప్పతాగిన ఓ మహిళా హల్ చల్ చేసింది.

First Published May 12, 2020, 11:50 AM IST | Last Updated May 12, 2020, 11:50 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద పట్టపగలే తప్పతాగిన ఓ మహిళా హల్ చల్ చేసింది. ఏడుస్తూ, బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది.వివరాల్లోకి వెళితే కరోనావైరస్ తో పనులు లేక 47 రోజులుగా కలో, గంజో తాగి సర్దుకున్నాం. ఇప్పుడు 
మంద్యంషాపులు తెరవడంతో ఇంట్లో గొడవలు మొదలైనయని వాపోతోంది. కేసీఆర్ వేసిన 1500 కోసం భర్త గొడవ పెడుతున్నాడని, పైసలియ్యకపోతే చంపుతా అంటున్నాడని ఏడుస్తోంది. అందుకే తానే ఫుల్లుగా తాగానని భర్తకు చంపుతానంటూ వెడుతోంది. దీంతో పోలీసులు భార్య, భర్తలిద్దరికీ నచ్చజెప్పి పంపించారు.

Video Top Stories