
Drunk and Drive Check: మద్యం మత్తులో పామును చేతికి చుట్టుకొని పోలీస్ లు షాక్
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడు అకస్మాత్తుగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులను బెదిరించాడు.ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొనగా, స్థానికులు మరియు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.