
Dr Sravan Dasoju: వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలని డాక్టర్ శ్రావణ్ దాసోజు కోరారు. ఇటీవల ఉన్నత విద్యలో బెంచ్‌మార్క్ వికలాంగులకు 5% రిజర్వేషన్, వయస్సు సడలింపులపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతించిన ఆయన, ఈ ప్రయోజనాలు ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా వర్తింపజేయాలని సూచించారు.