
పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. తండ్రి బహుమతిగా ఇచ్చిన పదవిని అనుభవిస్తున్న కవితకి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే అర్హత ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓడిపోగానే ఫామ్ హౌస్‌కి పరిమితమైన వారికి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.