ఆరోగ్య మంత్రి ఇలాకాలో... ప్రభుత్వాసుపత్రుల్లో ఇదీ దుస్థితి

 ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సెలైన్ బాటిల్ తో కారును శుభ్రం చేయించుకున్న ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. 

Share this Video

 ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సెలైన్ బాటిల్ తో కారును శుభ్రం చేయించుకున్న ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రికి రంగులు వేస్తున్న సమయంలో అక్కడే నిలిపి ఉంచిన వైద్యురాలి కారుపై సున్నం పడింది. దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిల్‌తో ఆమె కారును ఓ నర్స్ చేత శుభ్రం చేయించుకున్నారు. అయితే ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైద్యురాలు చేసిన ఈ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ వైద్యురాలు మాత్రం సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపి శుభ్రం చేశామని చెప్పారు.

Related Video