Asianet News TeluguAsianet News Telugu

నేడే హుజురాబాద్ లో దళిత బంధు... సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు

కరీంనగర్​ జిల్లా హుజూర్​బాద్​లో సోమవారం దళిత బంధు పథకాన్ని లాచనంగా ప్రారంభివంచనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని భారీ బహిరంగసభలో దళిత ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నారు సీఎం. ఈ సభ కోసం ఇప్పటికే హుజురాబాద్ మండలం శాలపల్లి ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కేసీఆర్ సభా ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. జేసిబితో సభా ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కందకం తవ్వించారు అధికారులు. ఈ గందకం గుంతల్లోకి వర్షపు నీరు చేరింది.  అంతేకాకుండా భారీ వర్షానికి సభ ఆవరణలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల మయంగా మారింది. దీంతో అధికారులు బురద మయం అయిన మట్టి రోడ్లపై కంకర చూర వేసి లెవలింగ్ చేస్తున్నారు.  
 
First Published Aug 16, 2021, 10:11 AM IST | Last Updated Aug 16, 2021, 10:11 AM IST