ఆరోగ్యశ్రీలోకి కరోనా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునే పనిలోనే ప్రభుత్వం ఉందని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. 

Share this Video

కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునే పనిలోనే ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వం ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు కరోనా వైద్యం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న జగ్గారెడ్డి.. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలా చేయకపోతే తాను వెంటనే దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

Related Video