Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లో దళారుల రాజ్యం నడుస్తుంది ..కేకే మహేందర్ రెడ్డి

సమృద్ధిగా నిధులు ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.

First Published Aug 26, 2023, 12:53 PM IST | Last Updated Aug 26, 2023, 12:53 PM IST

సమృద్ధిగా నిధులు ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకులు మారుతాయి అనుకున్న ప్రజలకు నిరాశ మిగిలిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అండ చూసుకొని నియోజకవర్గంలో భూ దందాలు, ఇసుక మాఫియా, మైనింగ్ వంటి వి విచ్చలవిడిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన పేద ప్రజల బతుకులు మార్చేందుకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మండలానికి ఐదుగురు చొప్పున బడా నాయకులు బాగుపడ్డారు తప్ప వేరే ఏమీ అభివృద్ధి చెందలేదని ఆరోపించారు.