
CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇకపై నోటీసులు, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించే జరిమానాలను నేరుగా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోందని ఆయన వెల్లడించారు.ఈ విధానం వల్ల ట్రాఫిక్ నియమాల పాటింపు మరింత పెరిగి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీఎం అన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.