
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. విమానాలు ఆలస్యం కావడంతో అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే చిక్కుకుపోయారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.