Huzurabad Bypoll:నోట్లిస్తేనే ఓట్లు... టీఆర్ఎస్ పంచే డబ్బులు అందలేదంటూ రోడ్డెక్కిన మహిళలు
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు భారీగా డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు భారీగా డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటుకు పదివేలు ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు మహిళలు తమకు డబ్బులు అందలేదంటూ రోడ్డెక్కారు. వీణవంక మండలం గంగారం, ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామానికి చెందిన మహిళలు టీఆర్ఎస్ పార్టీ డబ్బులు రాలేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.