Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే కాలేరుతో కార్పోరేటర్ భర్త వాగ్వాదం... అంబర్ పేటలో బిఆర్ఎస్ లో రచ్చ

హైదరాబాద్ : అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కు సొంత పార్టీ నాయకుడే షాకిచ్చాడు. 

హైదరాబాద్ : అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కు సొంత పార్టీ నాయకుడే షాకిచ్చాడు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్, గోల్నాక కార్పోరేటర్ దూసరి లావణ్య భర్త రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. అంబర్ పేట అలీ కేఫ్ ప్రాంతంలో నాయకులిద్దరూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపు చేసారు. తానేంటో చూపిస్తానంటూ ఎమ్మెల్యే వెంకటేశ్ కార్పోరేటర్ వర్గీయులను హెచ్చరించి అక్కడినుండి వెళ్లిపోయారు.