
బీఆర్ఎస్ ఈ ఏడాది ఫుల్ బిజీ.. 2025 షెడ్యూల్ ప్రకటించిన కేటీఆర్
తెలంగాణ తల్లి విముక్తి కోసం చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం తెలంగాణ సామాజిక చరిత్రలోనే ఒక ఉజ్వల ఘట్టమన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఓ వైపు పార్టీ రజతోత్సవ సంబరాలను ఈ ఏడాదంతా నిర్వహిస్తూనే.. తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థంచేసుకున్న పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తల్లడిల్లుతున్న వివిధ వర్గాల తరుపున ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతామని తెలిపారు.