కవిత.. చిత్తశుద్ధి ఉంటే ఆ పదవీ బీసీకి ఇవ్వండి: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు | Asianet News Telugu
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి ఉంటే కేసీఅర్‌తో మాట్లాడి ఆ పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇవ్వాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ, శాసన మండలిలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బీసీలను ఎన్నుకోవాలన్నారు. బీసీల్లో పెద్ద సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను మధ్యలోనే మంత్రి పదివి తీసేసిన పార్టీ బీఅర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగిందని కవిత మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.