క్లౌడ్ బరస్ట్ కామెంట్స్... సీఎం కేసీఆర్ కు ఈటల స్ట్రాంగ్ కౌంటర్

పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వెనక విదేశీ కుట్ర దాగివుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Share this Video

పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వెనక విదేశీ కుట్ర దాగివుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో విద్వంసం సృష్టించడానికి క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ వర్షాలు కురిసేలా కుట్ర జరిగిందంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పెద్దపల్లి పట్టణంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన బారీ వర్షాల వెనక విదేశీ కుట్ర దాగివుందని... క్లౌడ్ బరస్ట్ అంటూ కేసీఆర్ వింతగా మాట్లాడుతున్నారని అన్నారు. కానీ ప్రకృతిని శాసించే శక్తి కేవలం ఆ అమ్మవారికే వుందని ఈటల పేర్కొన్నారు. అమ్మవారే వరద ప్రభావిత ప్రాంతాల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలని ఈటల కోరుకున్నారు.

Related Video