కరీంనగర్ లో ఘోరం... ఆర్టిసి బస్సు ఢీకొని యాచకురాలు దుర్మరణం

కరీంనగర్ : రోడ్డు దాటుతుండగా ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బిచ్చగత్తె అక్కడికక్కడే మృతిచెందింది.

Share this Video

కరీంనగర్ : రోడ్డు దాటుతుండగా ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బిచ్చగత్తె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో బిక్షమెత్తుకునే ఎంకవ్వ రోజూ మాదిరిగానే ఇవాళ కూడా అక్కడికి వచ్చింది. అయితే రోడ్డు దాటే క్రమంలో ఆమెను బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఎంకవ్వ ప్రాణాలు కోల్పోయింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని ఎంకవ్వ మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన బస్సును, డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Related Video