ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం... సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి సంబరాలు

హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించారు.దీంతో హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయం వద్ద సందడి నెలకొంది.

First Published Mar 17, 2023, 1:59 PM IST | Last Updated Mar 17, 2023, 1:59 PM IST

హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించారు.దీంతో హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అద్భుత విజయం సాధించిన ఏవిఎన్ రెడ్డికి తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. పుష్ఫగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించి  మిఠాయి తినిపించారు. తనకు అవకాశమిచ్చి గెలుపుకు కృషిచేసిన బిజెపి నాయకులందరికీ ఏవిఎన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లిలోని బిజెపి ఆఫీస్ బయట బ్యాండ్ బాజాలతో సంబరాలు చేసుకున్నారు బిజెపి శ్రేణులు.ఈ సంబరాల్లో పాల్గొన్న బండి సంజయ్, ఏవిఎన్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బ్యాండ్ వాయించారు. ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు బిజెపిలో మరోసారి ఉత్సాహాన్ని పెంచింది.