జహిరాబాద్ లో ఆకతాయిల వికృత చేష్టలు...భర్త ముందే భార్యను వేధించి దాడి

సంగారెడ్డి : అర్ధరాత్రి భర్తతో కలిసి ఇంటికి వెళుతున్న మహిళతో కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తించారు.

Share this Video

సంగారెడ్డి : అర్ధరాత్రి భర్తతో కలిసి ఇంటికి వెళుతున్న మహిళతో కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తించారు. దంపతులను కారులో వెంబడించడమే కాదు మహిళతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు స్థానిక పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నడిరోడ్డుపైనే భార్యాభర్తలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో చోటుచేసుకుంది. 

జహిరాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన దంపతులు అర్ధరాత్రి స్థానిక బస్టాండ్ నుండి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో కొందరు యువకులు అడ్డుకున్నారు. మహిళతో యువకులు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా రక్షణ కోసం ఎవరికో ఫోన్ చేస్తుండగా లాక్కుని దాడికి పాల్పడ్డారు. వారిని వికృత చేష్టలను అడ్డుకునే ప్రయత్నం చేయగా మహిళ భర్తను కూడా చితకబాదారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోలు సిసి కెమెరాలో రికార్డవడంతో నిందితులకు గుర్తించి అరెస్ట్ చేసినట్లు జహిరాబాద్ పోలీసులు తెలిపారు.

Related Video