రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్ | Champions Trophy Final 2025 | Asianet News Telugu
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠ రేగింది. కానీ చివరకు రోహిత్ సేన విజయాన్ని అందుకుంది. ఛాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్ ఇచ్చిన 252 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ టీమిండియా మంచి ఆరంభం పొందింది. కానీ తర్వాత వికెట్లు కోల్పోయింది. కానీ చివరకు మరో ఓవర్ మిగిలి వుండగానే విజయాన్ని అందుకుంది. దీంతో 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్దీన్ లాంటి గొప్ప ఆటగాళ్ల సరసన చేరాడు.