IPL 2025: వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ చిన్నబోవాల్సిందే... | Asianet News Telugu
వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ చిన్నబోవాల్సిందే... .ప్రత్యర్థి బౌలర్లకు ఊచకోత తప్పదు. అందుకే వీడిని తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా 'కాటేరమ్మ కొడుకు' అని పిలుచుకుంటారు... ఈ పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. సలార్ మూవీలో కాటేరమ్మ ఫైట్ హైలైట్... కానీ ఐపిఎల్ మూవీలో మన కాటేరమ్మ కొడుకు క్లాసేన్ ఊచకోతే హైలైట్. మైదానంలో అడుగుపెట్టాడంటే అతడు పూనకంతో ఊగిపోతాడు. పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని పరితపిస్తాడు. మొత్తంగా ప్రత్యర్థులను పిండి ఆరేస్తాడు. అందువల్లే ఇతడి బ్యాటింగ్ ను ఇష్టపడని అభిమాని ఉండడంతే అతిశయోక్తి కాదు.