
Pak Vs Ind: పాక్ ఓటమికన్నా కోహ్లీ సెంచరీ ఎక్కువగా బాధపెడుతోంది: పాక్ ఫ్యాన్స్ ఏడుపు
దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో పాక్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగరేసింది. దాయాది దేశాన్ని 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అటు, పాక్ ఫ్యాన్స్ మాత్రం షాక్ లోకి వెళ్లిపోయారు.