IND Vs NZ Final: ఈ నలుగురు కివీస్ బ్యాట్స్‌మెన్ తోనే భారత్ కు గండం | Champions Trophy
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్‌లో జరుగుతుంది. టైటిల్ పోరు కోసం రెండు జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. ఇప్పటివరకు సాగిన టోర్నమెంట్‌ను పరిశీలిస్తే రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ చాలా బలమైన జట్టు. భారత్‌కు ట్రోఫీని అందకుండా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు, న్యూజిలాండ్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో కీలకం కానున్న నలుగురు బ్యాట్స్‌మెన్ల ఎవరు? ఎందుకు వారితో భారత్ కు ప్రమాదం ఉందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.