
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను రఫ్ఫాడించిన టాప్-5 భారత బ్యాటర్లు
ఫిబ్రవరి 23, ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఉత్కంఠభరితమైన ఛేజింగ్‌ల నుండి ఆధిపత్య ప్రదర్శనల వరకు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత బ్యాటర్లు తరచుగా పాకిస్థాన్ ను రఫ్ఫాడించారు. మరీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.